సెబ్ కార్యాలయంలో మంత్రి అంబటి హల్‌చల్

63చూసినవారు
సెబ్ కార్యాలయంలో మంత్రి అంబటి హల్‌చల్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెబ్ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు హల్‌చల్ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న కేసులో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇద్దరు నిందితులను విడిపించుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కొమెరపూడి వద్ద సెబ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై మద్యం తీసుకెళ్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. దాంతో మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి సెబ్ కార్యాలయానికి వెళ్లి నిందితుల్ని విడిపించుకెళ్లినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్