కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సొంత నియోజకవర్గం బీహార్‌లోని బెగుసరాయ్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. గిరిరాజ్ సింగ్ మాట్లాడుతుండగా ఓ యువకుడు వేదికపైకి చేరుకున్నాడు. మైక్ లాక్కుని, కేంద్రమంత్రికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. అంతేకాకుండా కేంద్ర మంత్రిని కొట్టేందుకు యత్నించాడు. అయితే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు, పోలీసులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.