ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన గోల్డ్మన్ శాక్స్ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. సిబ్బంది వార్షిక పనితీరు సమీక్ష ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు తమ మొత్తం ఉద్యోగుల్లో 3 నుంచి 4 శాతం మందిని తొలగించడానికి సిద్ధమవుతోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దీంతో 1,300-1,800 మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారని పేర్కొంది.