ఝార్ఖండ్‌లో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో వారు ఓటు వేశారు. అయితే, ధోనీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో భారీ బందోబస్తు మధ్య ధోనీ దంపతులకు రక్షణ కల్పించారు.