TDP మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు. మైలవరంలో మైనింగ్ అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో తన ప్రస్తావన తెచ్చారని వసంత మండిపడ్డారు. మైలవరంలో జరిగిన ఏర్ మైనింగ్ అక్రమాల్లో తన పేరు ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. శాసన మండలి రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు.