ఇటీవల కాలంలో చాలామంది ఇయర్ ఫోన్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడటంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సౌండ్‌తో వీటిని వాడితే వినికిడి సమస్యలు వస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. అస్తవ్యస్తంగా ఇయర్ ఫోన్స్‌ను చెవిలో పెట్టుకొని ఉంచడంతో చెవి నొప్పి వస్తుంది. 60% కంటే ఎక్కువ సౌండ్, అరగంటకు మించి కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోకూడదు.