ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తుదారులు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపైన అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆధార్, రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు, బ్యాంకు ఖాతాతో అనుసంధానంగా ఉన్న ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్లకు వీటితో పాటు భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయ సిబ్బందికి ఇవ్వాలి.