ఉత్తమ సేవలకు సత్కారం
By W. Abdul 69చూసినవారుఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సర్జన్ డాక్టర్ మధు ఉత్తమ సేవలకు సత్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఉత్తమ సేవలు అందించినందుకు సూపరింటెండెంట్ శ్రీరాముల చేతుల మీదుగా శుక్రవారం ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేయడం పట్ల ఆయన్ను అభినందించారు. ప్రశంసా పత్రాన్ని అందుకోవడం తన బాధ్యతలను మరింత పెంచిందని సత్కార గ్రహిత మధు అన్నారు.