ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం 9, 053 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 46 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 10, 158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.