ఆళ్లగడ్డ రౌండ్ టేబుల్ సమావేశం

76చూసినవారు
ఆళ్లగడ్డ రౌండ్ టేబుల్ సమావేశం
ఆళ్లగడ్డ పట్టణంలోని షాదీ ఖానాభవన్ లో ఆదివారం స్థానిక జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల, కడప నుండీ ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు ఎం.ఆర్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ దస్తగిరి, ఖాదర్ భాషాలు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఈ నెల 8 న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024 ముఖ్య ఉద్ధేశ్యం వక్ఫ్ భూములను లాక్కోడానికి మాత్రమే ఈ సవరణ బిల్లును బీజేపీ తెచ్చిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా భూములు అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురయ్యాయని, మిగిలిన భూముల్ని కూడా ముస్లింల నుండీ  లాక్కోవడానికి వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్