ఆళ్లగడ్డ పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న శారద శిల్పకళా మందిరం ఆవరణలో.. దురుగడ్డ రవీంద్ర చారి, సావిత్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రి వారి సౌజన్యంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మారెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, జూనియర్ డాక్టర్లు దాదాపు 500 మందికి పైగా శిల్ప కళాకారులకు, స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.