దొర్నిపాడు మండలం భాగ్యనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే అఖిల ప్రియ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు లేవని, బిల్డింగ్స్ కొన్నిచోట్ల పాడైపోయాయని తెలిపారు. స్కూల్ కాంపౌండ్ వాల్ సరిగా లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని పాఠశాలను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.