నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామానికి చెందిన చోరీ కేసును పోలీసులు ఆదివారం చేదించారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంట్లో పగిడి నరసింహ అనే నిందితుడు చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు నరసింహ నుంచి 6 తులాల 5 గ్రాముల బంగారం, రూ. 7. 80 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మీడియా సమావేశంలో వెల్లడించారు.