అంగన్వాడి సిబ్బంది సమయపాలన పాటించాలి
గుత్తి పట్టణంలోని స్వీపర్ కాలనీలో గల అంగన్వాడి కేంద్రాన్ని గురువారం అంగన్వాడి సూపర్వైజర్ నాగేశ్వరి తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు పట్టికను ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల సమయపాలన పాటించాలని విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచాలని తెలిపారు.