కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు క్రమంలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం ఎగువ నుంచి 11, 350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సుంకేసుల డ్యాం నుంచి 2 గేట్లను ఎత్తి దిగువకు 8, 892 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.