కర్నూలు: దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు: ఎస్వీ

63చూసినవారు
తమ పార్టీ వారిపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కర్నూలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ నాయకులను హెచ్చరించారు. బుధవారం టీడీపీ దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ మైనార్టీ నేత ముస్తఫాను ఆయన పరామర్శించి, మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మారిన 5 నెలల్లోనే కర్నూలు నగరంలో టీడీపీ నాయకులు మంత్రి అండతో దాడులకు తెగ బడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్