గ్రామాలలో ప్రబలే అతిసార వ్యాధి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా ఆదేశించారు. మంగళవారం కౌతాళంలోని మండల పరిషత్ కార్యాలయంలో అతిసార వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిసార వ్యాధి సోకకుండా తాగునీటి సక్రమంగా క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.