పశుపోషణ, వాటి అభివృద్ధికి గోకులం షెడ్లు ఎంతో ఉపయోగపడతాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామాల్లో శుక్రవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గోకులం షెడ్లు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు గోకులం షెడ్లు ఎంతో ఉపయోగం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.