నందికోట్కూరు: పశు ఆరోగ్య శిబిరాల అవగాహన సదస్సులు

56చూసినవారు
నందికోట్కూరు: పశు ఆరోగ్య శిబిరాల అవగాహన సదస్సులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి 31 వరకు అన్ని గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు శాసన సభ్యులు గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం నందికోట్కూరు మండలంలోని శాతనకోట గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పశు వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింత కుంట నారాయణ, తిమ్మారెడ్డి, రామకృష్ణ, రామసుబ్బారెడ్డి, ఎంపిటిసి సుబ్బయ్య పాల్గొన్నారు.