పత్తికొండ: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు: శ్రీదేవి

84చూసినవారు
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏ విధంగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారో అదేతరహాలో బడ్జెట్ లోను    బురిడీ కొట్టించారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. మంగళవారం పత్తికొండలో మాట్లాడారు. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ఇంటింటికీ వెళ్లి మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక లేనిపోని కథలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఉద్యోగాల ఊసేలేదు, నిరుద్యోగులకు రూ. 3 వేల ఏదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్