రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రానికి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేడుకను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా ప్రతి ఏటా శ్రావణమాసంలో అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు విశేష పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.