వైభవంగా సాయినాధుని రథోత్సవం

75చూసినవారు
వైభవంగా సాయినాధుని రథోత్సవం
ఆత్మకూరు పట్టణంలో గురు పౌర్ణమి వేడుకను పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయిబాబా రథోత్సవ కార్యక్రమం ఆదివారం కమనీయంగా సాగింది. ముందుగా శ్రీశిరిడి సాయిబాబా ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై కొలువు తీర్చి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈవేడుకను పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you