శ్రీశైలం: ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
By M. Mahesh babu 62చూసినవారుశ్రీశైలం లో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. యాగశాల యందు చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. లోకకల్యాణంకోసం జపాలు, రుద్రపారాయణలు, చతుర్వేద పారాయణలు, చేయబడ్డాయి. మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం, చండీహోమ నిర్వహించారు.