అనుమసముద్రంపేట: నక్కల వాగును పరిశీలించిన అధికారులు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమసముద్రం పేట మండలంలోని గుడిపాడు గ్రామం సమీపంలోని నక్కల వాగును స్థానిక ఎమ్మార్వో, ఏఎస్పేట ఎస్సై సైదులు బుధవారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నక్కల వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు హెచ్చరికలు చేశారు. కాగా మంగళవారం ఇదే వాగును ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్, సంఘం సీఐ వేమారెడ్డి లు సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు.