పదవ తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

1054చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
ఆత్మకూరు మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలు అయినటువంటి ఆత్మకూరు, బట్టేపాడు మరియు అప్పారావుపాళెం పాఠశాలలో పదవతరగతి చదువుతున్న 120 మంది విద్యార్థిని విద్యార్థులకు ఐక్య ఫౌండేషన్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఇంజనీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ నాయుడు గారు చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ధనుంజయ నాయుడు గారు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు యువతీ యువకుల జీవితాలకు దిక్సూచి లాంటిదని మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. అనంతరం ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్ష సమయంలో నూతన ఉత్సాహం నింపిన వారవుతామని, విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థి భవిష్యత్తుకు పునాది ఈ పదవతరగతి అని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనంజయనాయుడు, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి, ఐక్య ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్
పయ్యావుల మారుతినాయుడు, సునీల్, ప్రతాప్, వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్