ఏమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా చెప్పాలి: ఆత్మకూరు ఆర్డీవో

54చూసినవారు
ఏమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా చెప్పాలి: ఆత్మకూరు ఆర్డీవో
ఏమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా తెలపాలని ఆత్మకూరు ఆర్డీవో భూమిరెడ్డి పావని విద్యార్థులను కోరారు. ఆత్మకూరు పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం తింటున్న విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పాలన్నారు. వసతులపై ఆరా తీశారు. పరిసరాలు శుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉండకూడదని అధ్యాపకులు, సిబ్బందిని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్