చిల్లకూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తిరుమల పాల డైరీ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. అయితే నాయుడుపేట వైపు నుంచి గూడూరు వైపు వస్తుండగా ఒక స్కూటరిస్ట్ మరో స్కూటర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 108 వాహనంలో గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.