హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ శివ.. తమతో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స్నాప్ చాట్ లో మెసేజ్‌లు పంపుతున్నాడని అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను మీడియాకు అందించారు. 'వైట్ డ్రెస్సులో అందంగా ఉన్నావు. నీకు లవర్ ఉన్నాడా? నువ్వు హర్ట్ అయితే నేను ఉండలేను' అని పంపాడని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు.