అతడికి కాళ్లు లేవు. తాను దివ్యాంగుడినని బాధపడలేదు. కుంగిపోలేదు. తానూ అందరిలాంటివాడినేనని భావిస్తూ తనకిష్టమైన క్రికెట్ గేమ్ ఆడేస్తున్నాడు. బౌలింగ్ చేస్తూ ఆటను ఆస్వాదిస్తున్నాడు. స్ఫూర్తిని రగిలించే పై వీడియో ఎక్కడిదో ఏమో గానీ నెట్టింట వైరల్ అవుతోంది. అన్నీ చక్కగా ఉన్నా జీవితంలో పట్టుదల లేని వారికంటే నువ్వు ఎన్నో రెట్లు బెటర్ సోదరా అంటూ ఆ వీడియోకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.