హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడాలంటే రూ.లక్ష యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ అన్నారు. 'దేశంలో అన్ని నగరాల్లో కాలుష్యం ఆక్రమించింది. బెంగుళూరులో ట్రాఫిక్ దారుణంగా ఉంటుంది. కోల్‌కతాలో ఉన్న మురికి ఈ భూమిమీద ఎక్కడా లేవు. ఆ నగరాలు సమస్యను పరిష్కరించలేని స్థితికి చేరుకున్నాయి. HYDని క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేస్తుంటే.. BRS, BJP అడ్డుకుంటున్నాయి' అని మండిపడ్డారు.