పుష్ప-2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప-2 చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ 'శ్రీశైలం' అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్పులు సూచించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది తెలిపారు. ఊహాజనిత ఆరోపణల ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కు జరిమానా విధించింది.