చెన్నూరులో మహిళ దారుణ హత్య
తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులో మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. చెన్నూరు గ్రామానికి చెందిన అనంతమ్మ అనే మహిళను ఆమె అల్లుడు కర్రతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.