నెల్లూరు జిల్లాలో దొంగల బీభత్సం
ఇందుకూరుపేట మండలం మైపాడులో తాళం వేసిన ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబం హైదరాబాద్కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు ధ్వంసం చేసి ఈ చోరీ చేశారు. స్థానికులు ఉదయం తలుపులు తెరిచి ఉండటం గమనించి యజమానికి సమాచారం అందించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, డీఎస్సీ శ్రీనివాసరావు, సీఐ సుదాకర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.