ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సమస్యలుపై వచ్చిన పిర్యాదులు మేరకు కొన్ని ప్రాంతాల్లో అక్రమ మోటార్ కనెక్షన్లు అధికారులు తొలగించారన్నారు. త్రాగునీటి సమస్య తగ్గాలంటే కాజ్వే నిర్మాణం పూర్తి కావాలన్నారు.