కలిగిరి: ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా కొండాపురం నుండి కలిగిరి వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడిని, కలిగిరి నుండి కృష్ణారెడ్డి పాలెం వైపు కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్లోని కర్ర ద్విచక్రవాహనదారుడు మనోహర్ మెడకు గుచ్చుకోవడంతో లోతైన గాయం అయ్యింది. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి, హుటాహుటినా ఓ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.