నెల్లూరు జిల్లా ఉలవపాడు గ్రామపంచాయతీ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దోమల నివారణ లో భాగంగా ఆదివారం ఫాగింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు నుండి మొదలు పంచాయతీ మొత్తం ఫాగింగ్ నిర్వహిస్తామని పంచాయతీ అధికారులు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మానికల నాగలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త అల్తాఫ్ పాల్గొన్నారు.