ఆకలికి అందరూ బంధువులే అనే నినాదంతో కుల, మతాలకతీతంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు ఐఎఫ్సి ఫౌండేషన్ కందుకూరి వారి ఆధ్వర్యంలో ఒకదాత సహకారంతో కందుకూరు లోని వృద్ధులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సభ్యులు మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే వారి తరఫున నిరుపేద ప్రజలను గుర్తించి వారికి సహాయం చేసేందుకు తమ సంస్థ తరుపున సిద్ధంగా ఉన్నామని తెలిపారు.