కందుకూరు పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు శుక్రవారం సాయంత్రం దీపం 2. 0 మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకాన్ని ప్రారంభించారన్నారు.