గుడ్లూరు మండలం చేవూరు అటవీ, చెరువు పోరంబోకు భూములను రామదూత ఆశ్రమం కబ్జా చేసిందని హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నార్నే వెంకటసుబ్బయ్య ఆరోపించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. భూముల స్వాధీనంపై నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీచేసిన గుడ్లూరు తహశీల్దార్ చర్యలు తీసుకోకపోవడం లేదన్నారు.