నూతనంగా కందుకూరు డివిజన్ కు డివైఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యంను గురువారం ఆయన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బుర్ర మధుసూదన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గం పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించి పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరారు.