లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టుకు 12 అడుగుల మేర నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం పెరిగి అధికారులు నీరు కిందకు విడుదల చేసే అవకాశం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. మన్నేరు వాగు ప్రవహించే ఇరువైపుల ఉండే గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట మన్నేరు ప్రవాహ ప్రాంతాలకు ఎవరు వెళ్ళరాదని ఎమ్మెల్యే తెలిపారు.