రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది

82చూసినవారు
రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం గుడ్లూరులో పర్యటించారు. స్థానిక టిడిపి శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటూరి ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం వంద రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్