ఉలవపాడు మండలం కరేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ క్యాన్సర్ పరీక్షతోపాటు బీపీ, షుగర్ పరీక్షలు కూడా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ ఈ సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓలు స్వాతి, దివ్య, ఏఎన్ఎం పద్మ, గోవిందమ్మ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్త అల్తాఫ్ పాల్గొన్నారు.