ఇటీవల మూడు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం పరిధిలోని కరేడు ర్యాంపు వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కింద వర్షపునీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.