Sep 20, 2024, 09:09 IST/
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య
Sep 20, 2024, 09:09 IST
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో దూకిన సంబరి శారద(33) మృతదేహాన్ని బయటకు తీశారు. కూతురు స్పందన(14) మృతదేహం దొరకలేదు. ఎస్సై జె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిస్క్ టీం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.