నెల్లూరు జిల్లా, కావలి మున్సిపాలిటీ అధికారుల పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలు తెలిపిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పరిష్కార మార్గం చూపుతున్నారని తెలిపారు. కావలిలోని 13వ వార్డులో దోమలు ఎక్కువగా ఉన్నాయని కమిషనర్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించిన కమిషనర్ తమ సిబ్బందితో దోమల పొగను స్ప్రే చేయించారు. వెంటనే స్పందించిన ఆయన పనితీరును స్థానికులు అభినందించారు.