చిలుక వాహనంపై శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం

84చూసినవారు
చిలుక వాహనంపై శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం
విడవలూరు మండలంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణ, మంగళ వాయిద్యాలు, బాణాసంచాలతో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్