బుచ్చి మండలంలోని జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంను నెల్లూరు జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి ఎల్ తేజోవతి దంపతులు ఆదివారం అమ్మవారి పులకాపు (వస్త్రాలంకరణ సేవ) సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.