పోలీస్ కార్యాలయంలో ఘనంగా అల్లూరి జయంతి

81చూసినవారు
మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పి సౌజన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్. పి. (ఎ. ఆర్) శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్