బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 0861-2331261 సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.